Who is Better, CSK or SRH? చెన్నై హైదరాబాద్ పై ప్రతీకారం తీర్చుకుంటుందా?
ఐపిఎల్ 2024 సీజన్ 17 లో భాగంగా జరుగుతున్న 46 వ మ్యాచ్ లో తలపడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ జట్టు గెలుపొందుతుందోనని క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెప్పుకోతగ్గా రికార్డ్స్ లేవ్వు కానీ అదంతా గతం,ఐపిఎల్ 2024 లో ఆడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అన్నీ సీజన్లకు భిన్నంగా కనిపిస్తుంది.ఐపిఎల్ 2024 18 వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది కానీ అది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో, కానీ చెపాక్లో చెన్నై ని తకిడిని తట్టుకొని నిలబడే సత్తా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఉందా? అసలు ఇరుజట్ల బలం బలహీనతలు ఏంటి? ఈ మ్యాచ్లో గెలిచే అవకాశం ఏ జట్టుకు ఉంది?
చెన్నై హైదరాబాద్ పై ప్రతీకారం తీర్చుకుంటుందా?
వేదిక:
చీదబరం స్టేడియం, చెన్నై
టాస్ కీలకంగా మారే అవకాశం ఉండవచ్చు. ఎందుకంటే సెకండ్ బౌలింగ్ చేసే జట్టుకు మంచు ప్రభావం ఇబ్బందిగా మారే అవకాశం ఉండవచ్చు అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉండవచ్చు
చెపాక్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కు చెపాక్ స్టేడియం లో చివరగా ఆడిన 4 మ్యాచ్ లలో ఒక్కటంటే ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది.
చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గెలుపు పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది అందుకే చెపాక్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద సవాలే.
బలం బలహీనతలు:
- భువనేశ్వర్ కుమార్ అజింక్య రహానే పై మంచి రికార్డ్ ఉంది.17 ఇన్నింగ్స్ లలో 6 సార్లు ఔట్ చేశాడు. అజింక్య రహానే స్ట్రైక్ రేట్ కేవలం 88 మాత్రమే ఉంది.
- డెత్ ఓవర్లలో టి నటరాజన్ స్ట్రైక్ రేట్ 9 తో బౌలింగ్ చేస్తూ 7 వికెట్లు తీసుకున్నాడు.
- జయదేవ్ ఉనద్కత్ 2 వికెట్లు తీసుకుంటే 100 వికెట్లు తీసుకున్న 25 వ ఐపిఎల్ బౌలర్ గా రికార్డ్ లోకి ఎక్కుతాడు.
- ఎంఎస్ ధోనీ 3 క్యాచ్ లు పట్టుకుంటే ఐపిఎల్ లో 150 పూర్తిచేసుకుంటాడు.
- అభిషేక్ శర్మ, హెడ్ లు 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో పరుగులు చేస్తున్నారు.
- సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ 2024 18 వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడిచింది.
ప్లేయింగ్ 11 లో ఆడే ప్లేయర్స్:
చెన్నై సూపర్ కింగ్స్ :
రుతురాజ్ గైక్వాడ్(c),అజింక్యా రహానే,డారెల్ మిచెల్,రవీంద్ర జడేజా,శివమ్ దూబే,మొయిన్ అలీ,ఎంఎస్ ధోనీ(wk),దీపక్ చహర్,తుషార్ దేశ్ పాండే,ముస్తాఫిజూర్ రహ్మన్,మతీశా పతిరణ
ఇంపాక్ట్ ప్లేయర్:
శార్దూల్ ఠాకూర్
సన్ రైజర్స్ హైదరాబాద్:
ట్రావిస్ హెడ్,అభిషేక్ శర్మ,మర్క్రమ్,హెన్రీచ్ క్లాసెన్(wk),అబ్దుల్ సమద్,నితీశ్ కుమార్ రెడ్డి,షాబాజ్ అహ్మద్,ప్యాట్ కమిన్స్(c),భువనేశ్వర్ కుమార్,జయదేవ్ ఉనద్కత్,మయంక్ మార్కండే
ఇంపాక్ట్ ప్లేయర్:
టి నటరాజన్
Post Comment