RCB vs SRH Head to Head క్లాసెన్ కుర్చీ మాడతాబేడితే?
సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ లాంటి జట్లను ఓడించి కేవలం 4 పరుగులతో కోలకత్తా నైట్ రైడర్స్ పై ఓడిపోయి సన్ రైజర్స్ బరిలోకి వస్తుంటే,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 6 మ్యాచులు అడితే కేవలం ఒకే ఒక్క విజయంతో సరిపెట్టుకుంటుంది.ఈ సారైనా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పు అందిస్తుందని అభిమానులు ఆశిస్తుంటే,ఈ సారి కూడా కప్పు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఐపిఎల్ 2024 సీజన్ 17 కప్పు దూరంగానే వెళ్తుందా? లేక సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి,లేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు కప్పు మనదే అనే ఆశ కల్పిస్తుందా? అసలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హైదరాబాద్ ను ఒడిచాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గరున్న బలం ఏంటి? సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి ఎగబాకుతుందా? లేక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి హైదరాబాద్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కిందికి లాగుతుందా లేదా అనేది చూడాలి.
వేదిక:చిన్న స్వామి స్టేడియం,బెంగళూరు
టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది.చివరి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన 196 పరుగులను కూడా ముంబై ఇండియన్స్ 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.అంటే ఛేజ్ చేసే జట్టుకు స్టేడియం అనుకూలించే అవకాశం ఉంటుంది.
హెడ్ టు హెడ్:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 సార్లు గెలిస్తే,సన్ రైజర్స్ హైదరాబాద్ 12 సార్లు గెలిచింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఇదే స్టేడియంలో 2016 పైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి 208 పరుగులు చేసింది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 200 పరుగులకే చేసి రన్నరప్ గా నిలిచింది.
- బలం బలహీనతలు:ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 277 సన్ రైజర్స్ హైదరాబాద్ చేసింది.ఈ స్కోర్ తరువాత రెండవ ఐపిఎల్ అత్యధిక స్కోర్ 263 స్కోర్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
- సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ 2024 పాయింట్ల పట్టికలో 4 వ స్థానంలో ఉంటే,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10వ స్థానంలో ఉంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో 19 మంది ప్లేయర్స్ ను ఉపయోగించింది.19 మంది పేయర్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ వినియోగించిందంటే ఆ జట్టు ఎంత బలహీనంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
- సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి రెండు మ్యాచులలో 200 కంటే ఎక్కువ పరుగులను చేసింది.200 పరుగులను హైదరాబాద్ చేస్తుందంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
- హెన్రీచ్ క్లాసెన్ డెత్ ఓవర్లలో 234 స్ట్రైక్ రేట్ తో అడుతుంటే,దినేష్ కార్తీక్ 250 స్ట్రైక్ రేట్ తో అడుతున్నాడు.గ్లెన్ మాక్స్వెల్ ఐపిఎల్ అత్యధిక స్కోర్ 97 సన్ రైజర్స్ జట్టు మీదే ఉంది.
- మహ్మద్ సిరాజ్ 10ఓవర్లు పవర్ ప్లే లో బౌలింగ్ చేస్తే 103 పరుగులు సర్పించుకున్నాడు.ఒక్క వికెట్ కూడా తీసుకోకుండానే.
ప్లేయింగ్ 11 లో ఆడే ప్లేయర్స్ ఎవరు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డూప్లెసిస్(c),విరాట్ కోహ్లీ,విల్ జాక్స్,గ్లెన్ మాక్స్వెల్/కామెరన్ గ్రీన్,రజత్ పటిదర్,మహిపాల్ లోమ్రోర్,దినేష్ కార్తీక్,అనుజ్ రావత్/సౌరవ్ చౌహాన్,మహ్మద్ సిరాజ్,ఆకాష్ దీప్,టాప్లీ
ఇంపాక్ట్ ప్లేయర్: విజయ్ కుమార్ వైశాక్
సన్ రైజర్స్ హైదరాబాద్:ట్రావిస్ హెడ్,అభిషేక్ శర్మ,మర్క్రమ్,నితీశ్ కుమార్ రెడ్డి,రాహుల్ త్రిపాటి,హెన్రీచ్ క్లాసెన్,అబ్దుల్ సమద్,షాబాజ్ అహ్మద్,కమిన్స్,భువనేశ్వర్ కుమార్,జయదేవ్ ఉనద్కత్
ఇంపాక్ట్ ప్లేయర్: టి నటరాజన్
Post Comment