KKR vs RR Hed to Head IPL 2024
ఐపిఎల్ 2024 సీజన్ 17 లో అగ్రస్థానం కోసం పోరు మొదలైంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్,రెండవ స్థానంలో ఉన్న కోలకత్తా నైట్ రైడర్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. ఈ ఇరుజట్లు కూడా ఒకే ఒక్క మ్యాచ్ లో ఓటమిని చవిచూశాయి.6 మ్యాచ్లు ఆడి రాజస్తాన్ రాయల్స్ 10 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండి,ఐపిఎల్ సీజన్ 17 కప్పు మాదే అని హెచ్చరిస్తుంటే,ఈసారి కప్పు పైకెత్తే అవకాశం మాకేం తక్కువేమీ లేదు అని కోలకత్తా నైట్ రైడర్స్ 5 మ్యాచ్లు ఆడి 8 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది.రాజస్తాన్ రాయల్స్ కోలకత్తా నైట్ రైడర్స్ ను మట్టి కరిపించి రాజస్తాన్ రాయల్స్ అగ్రస్థానంలో కొనసాగుతుందా?లేక రాజస్తాన్ రాయల్స్ ను కోలకత్తా నైట్ రైడర్స్ ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకుంటుందా?
వేదిక:
ఈడెన్ గార్డెన్స్ ,కోలకత్తా
- టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది.ఎందుకంటే సెకండ్ బౌలింగ్ చేసే జట్టుకు మంచు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది.
- స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంటుంది.
హెడ్ టు హెడ్:
రాజస్తాన్ రాయల్స్,కోలకత్తా నైట్ రైడర్స్ మధ్య 27మ్యాచ్లు జరిగితే రాజస్తాన్ రాయల్స్ 13సార్లు గెలిస్తే,కోలకత్తా నైట్ రైడర్స్ 14సార్లు గెలిచింది.
బలం బలహీనతలు:
- యూజ్వేంద్ర చహాల్ ఐపిఎల్ 2024 లో ప్రతి 12బంతుల్లో ఒక్క వికెట్ తీసుకుంటున్నాడు. చహాల్ ఇంకా 3 వికెట్లు తీసుకుంటే t20 ల్లో 350వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో చేరుతాడు.
- ఈడెన్ గార్డెన్ లో సునీల్ నరైన్ ప్రతి ఓవర్కి 4 పరుగుల చొప్పున పరుగులు ఇస్తుంటే,మిగతా స్పిన్నర్లు ప్రతి ఓవర్కి 10పరుగుల చొప్పున పరుగులు ఇస్తున్నారు.
- ట్రెంట్ బౌల్ట్ మొదటి 3 మ్యాచ్లో పవర్ ప్లే లో 5వికెట్లు తీసుకుంటే,చివరి 3 మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు.
- సిమ్రాన్ హేట్మేయర్ డెత్ ఓవర్లలో 2022 నుండి 201 స్ట్రైక్ రేట్ తో అడుతున్నాడు.హేట్మేయర్ కంటే టీమ్ డేవిడ్ 213 స్ట్రైక్ రేట్ తో,దినేష్ కార్తీక్ 209 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నారు.
- ఈడెన్ గార్డెన్ లో సునీల్ నరైన్ 8 ఓవర్లు వేస్తే ప్రతి ఓవర్కి 4.5 ఎకానమీ తో పరుగులు ఇస్తూ,ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు.
- కోలకత్తా నైట్ రైడర్స్ కు పవర్ ప్లే లో మచి స్ట్రైక్ రేట్ కలిగి ఉంది.
ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశమున్న ప్లేయర్స్:
కోలకత్తా నైట్ రైడర్స్:
సాల్ట్(wk),సునీల్ నరైన్,రఘువంశి/నితీశ్ రాణా,శ్రేయస్ ఐయ్యారు(c),వెంకటేష్ ఐయ్యారు,రింకూ సింగ్,ఆండ్రూ రసూల్,రమన్ దీప్,మిచెల్ స్టార్క్,వైబవ్ అరోరా,హర్షిత్ రాణా,
ఇంపాక్ట్ ప్లేయర్:
వరుణ్ చక్రవర్తి
రాజస్తాన్ రాయల్స్:
యశస్వి జైస్వాల్,జోస్ బట్లర్,సంజు శాంసన్(c),రియాన్ పరాగ్,హేట్మేయర్,దృవ్ జూరేల్,రోవమాన్ పోవెల్ /కేశవ్ మహరాజ్,ట్రెంట్ బౌల్ట్,ఆవేష్ ఖాన్,కుల్దీప్ సేన్
ఇంపాక్ట్ ప్లేయర్:
యూజ్వేంద్ర చహాల్
Post Comment